Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాయ్ ఫ్రెండ్ ను ఖుషీ చేసేందుకు దొంగతనాలకు దిగిన ఇద్దరు కాలేజీ అమ్మాయిలు!

  • ఒకే యువకుడితో ఇద్దరమ్మాయిల డేటింగ్
  • లోకల్ రైళ్లలో సెల్ ఫోన్ల దొంగతనం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ముంబై పోలీసులు
తాము డేటింగ్ చేస్తున్న అబ్బాయిలను ఆనందింపజేసేందుకు ఇద్దరు అమ్మాయిలు దొంగల అవతారం ఎత్తారు. ముంబైలో మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ట్వింకిల్ సోనీ అనే యువతిని అరెస్ట్ చేయగా, ఈ మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది.

 పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోరివలి ప్రాంతానికి చెందిన ట్వింకిల్ సోని (20), తీనల్ పార్మార్ (19) డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ హృషీసింగ్ అనే యువకుడితో డేటింగ్ లో ఉన్నారు. బాయ్‌ ఫ్రెండ్ తో సరదాగా గడిపేందుకు కావాల్సిన డబ్బు కోసం ఇద్దరూ దొంగతనాలు చేయాలని నిర్ణయించారు.

నిత్యమూ బోరివలి నుంచి శాంతాక్రజ్ లో ఉన్న తమ కాలేజీకి ప్రయాణిస్తూ, మార్గమధ్యంలో మహిళా ప్రయాణికుల దృష్టిని మరల్చి సెల్ ఫోన్లను కొట్టేయడం వీరి పని. ఈ రెండు స్టేషన్ల మధ్యా తమ స్మార్ట్ ఫోన్లు పోతున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో, పోలీసులు మఫ్టీలో కాపు కాశారు. లోకల్ రైలులో ఓ మహిళ నుంచి సెల్ ఫోన్ ను ట్వింకిల్ దొంగిలిస్తుండగా, ఆమెను అరెస్ట్ చేశారు.
Mumbai
Police
Thief
Dating
Theft
Smatrphones

More Telugu News